సంగారెడ్డి: గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రామాన్ని అమలు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో పంచాయతీ రాజ్ సమ్మేళానాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ: ఎక్కడ లేనివిధంగా.. పారిశుద్ధ్య సమస్య లేకుండా ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వందే అన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం, డంప్ యార్డ్ నిర్మాణం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కాగా ప్రతి గ్రామం ఈ నెల 26 లోపు పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలన్నారు. 26వ తేదీ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో సహా మంత్రులు, ఉన్నతాధికారులు గ్రామాల్లో పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ నెల 26లో లక్ష్యాలను సాధించాలి: హరీష్‌రావు